
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KFC Chicken: KFC చికెన్ అంటే ఇష్టపడే ఫుడ్ లవర్స్ కు షాకిచ్చే ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన పెరిపెరి చికెన్ లో దుర్వాసన రావడంతో ఓ వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా వేడి వేడి చికెన్ వస్తుందని ఆశించిన కస్టమర్ కు క్వాలిటీ లేని ఆహారం అందడం ఆందోళనకు కారణం అయ్యింది. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు KFC ఔట్ లెట్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏప్రిల్ నెలలో ప్యాక్ చేసినట్లు ఉన్న చికెన్ లభ్యమైంది. ఏప్రిల్ నాటి చికెన్ ను ఫ్రెష్ గా తయారు చేసి వినియోగదారులకు అందించినట్లు తనిఖీల్లో బయటపడింది.
దీంతో అధికారులు సదరు కేఎఫ్‌సీ యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న చికెన్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అయితే, తుది పరీక్ష ఫలితాలు వచ్చేవరకు, ఆహారం నిజంగా పాడైపోయిందా లేదా నాణ్యతా ప్రమాణాలను ఏ మేరకు ఉల్లంఘించారో అధికారికంగా నిర్ధారించలేమని వారు పేర్కొన్నారు.
మంగళూరులో కేఎఫ్‌సీకి అనేక అవుట్లెట్లు ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీ ద్వారా కూడా చికెన్ ఉత్పత్తులను అందిస్తుంది. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, ప్యాకేజింగ్ తేదీలు, గడువు తేదీలు.. పరిశుభ్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి నొక్కి చెప్పింది. ల్యాబ్ నివేదిక అందిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి, ఈ విషయంపై అధికారుల తుది నివేదిక చాలా ముఖ్యమైనది.
అటు తెలంగాణలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో కుళ్లిపోయిన మాంసం, డెట్ ఎక్స్ పైరీ ప్రొడక్ట్సును గుర్తించి వాటి లైసెన్సులు రద్దు చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





