
బెంగుళూరు (చిత్రదుర్గం): రాష్ట్రంలో హిందువులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండో తరగతి ప్రజలుగా పరిగణిస్తోందని, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అనేక ఆంక్షలను పెడుతోందని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అశోక్ విమర్శించారు. బుధవారం మండ్యా జిల్లా మద్దూరులో 108 వినాయక విగ్రహాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేదని, పోలీసుల రాజ్యం ఉందని విమర్శించారు. మైనార్టీల ప్రార్థనా మందిరాలు ఉన్న వీధులల్లో వినాయక విగ్రహాల ఊరేగింపు నిర్వహించరాదని ప్రభుత్వం పేర్కొనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఊరేగింపులో డీజేలు, లౌడ్ స్పీకర్లు వాడకాన్ని నిషేధించడం, టపాసులు, బాణసంచా కాల్చడాన్ని అడ్డుకోవడాన్ని సహించబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతి పక్ష నాయకుడు చలవాడి నారాయణస్వామి, పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణములో ఏర్పాటు చేసిన 108 గణేశ్‌ విగ్రహాలను వీధులలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి నిమజ్జనం చేశారు. వేలాది మంది పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.