
బెంగుళూరు (చిత్రదుర్గం): భద్రా జలాశయం నుంచి సాగు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు దావణగెర కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. దావణగెర జిల్లాలోని హొన్నాలి, న్యామతి, చన్నగిరి తాలూకాల్లోని వేలాది ఎకరాల పంటలు, తోటలు వర్షాభావంతో ఎండి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హొన్నాలి ఎమ్మెల్యే శంతన గౌడ, మాజీ మంత్రి రేణుకాచారి తదితరులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. జలాశయం నుంచి నీటిని వదలెవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని మాజీ మంత్రి రేణుకాచారి చెప్పారు. వెంటనే సంబంధిత మంత్రులతో మాట్లాడి సాగు నీరు వదలడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





