
బెంగళూరు: ఫ్రిడ్జ్‌ పేలి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి నగరం చమౌలి గల్లీలో చోటుచేసుకుంది. రాజారాం ఇంట్లో సోమవారం కొత్త ఫ్రిడ్జ్‌ పేలింది. ఈ ఘటనలో శారద డమోలి (50), ఆమె కుమార్తెలు ప్రియా (28), గంగ (25), మరో మహిళ భారతి సజీవ దహనం అయ్యారు. రాజారంతో పాటు రోహన్‌ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





