
వెల్గటూర్: ఇరాక్ దేశంలోని రాయల్ దులీప్ హోటల్‌లో ఉంటున్న సుమారు 150 మంది జగిత్యాల జిల్లా వాసులు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండపాన్ని అలంకరించి ఏకదంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి తొమ్మిది రోజుల పాటు నిత్యం పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గాజుల రాజు, వినేయ్, నితిన్, రాహుల్, గణేష్ రోహిత్, సాయి, పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





