
Jemima Goldsmith : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్(Jemima Goldsmith) రెండో పెళ్లి చేసుకుంది. పన్నెండేళ్ల క్రితమే ఇమ్రాన్ నుంచి విడిపోయిన ఆమె 52 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తను మనువాడింది. ఐర్లాండ్, ఆస్ట్రేలియా నేపథ్యమున్న ఫైనాన్సర్ కామెరూన్ ఓ రీల్లీతో ఈమధ్యే జెమీమా వివాహ బంధంలో అడుగుపెట్టింది. నాకు ఇష్టమైన తేదీన పెళ్లి జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని తను పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న 12 ఏళ్లకు మళ్లీ పెళ్లి చేసుకుంది జెమీమా గోల్డ్‌స్మిత్. టీవీ రచయిత అయిన ఆమె 52 ఏళ్ల వయసులో.. తనకన్నా పదేళ్లు పెద్దవాడిని రెండో భర్తగా స్వీకరించింది. ఐరిష్, ఆస్ట్రేలియా వ్యాపారవేత్త అయిన కామెరూన్ ఓ రీల్లీని జెమీమా మనువాడింది. ‘జెమీమా, కామెరూన్ పెళ్లి. నాకిష్టమైన తేదీన. ఎంత సంతోషకరమైన రోజో కదా’ అని తన పెళ్లి విషయాన్ని వెల్లడించింది. సినిమాలు, డాక్యుమెంటరీలపై ఉన్న ఆసక్తితో ఇద్దరూ కలిశారని.. ఈ క్రమంలోనే మొదలైన ప్రేమ వీరి వివాహానికి దారి తీసింది. ఈ వారంలోనే 62 ఏళ్ల కామెరూన్‌తో జెమీమా పెళ్లి జరిగింది. Wishing you all the happiness and joy that you truly deserve, @Jemima_Khan Love from Pakistan 🇵🇰 ♥️ https://t.co/ApIEzPzULT — 804 (@Nadya329) September 14, 2026 బ్రిటన్‌కు చెందిన జెమీమా, ఇమ్రాన్ ఖాన్ లండన్ నైట్ ఔట్లో తొలిసారి చూసుకున్నారు. అప్పుడు తనకు 20ఏళ్లు. ఇమ్రాన్‌కు 42. ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఉన్నా సరే సినిమాలపై ఆసక్తి, వ్యక్తిగత అభిరుచులు కలవడంతో ఆమె 1995లో ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం ఇస్లాంలోకి మారిన జెమీమా ఖాన్‌గా పాక్‌లో అడుగుపెట్టింది. ఇమ్రాన్ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించింది తను. వీరికి ఇద్దరు కుమారులున్నారు. #BREAKING #JemimaGoldsmith marries multi-millionaire financier #CameronO ‘Reilly. The @DailyMail can disclose that Jemima, 52, an award-winning film Producer, exchanged vows at the weekend with Cameron O’Reilly, 62. #pakustv #NYC #weddingplanning #PTIprotest #Islamabad pic.twitter.com/CM9aRxVAnn — Ch.Amjad Ali (@saada186) September 14, 2026 అయితే.. రాజకీయ ఒత్తిళ్లు, మతపరమైన వేధింపుల కారణంగా 2004లో ఇమ్రాన్ నుంచి విడిపోయింది జెమీమా. ఇమ్రాన్‌కు దూరమైన ఆమె.. అతడిని విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని అర్ధించింది. ‘ఇదేమీ పాకిస్థాన్ రాజకీయ అంశం కాదు. ఇది అత్యవసరమైన మానవ హక్కుల అంశం’ అని మాజీ భర్తకు మద్దతుగా జెమీమా పోస్ట్ పెట్టింది. అవినీతి ఆరోపణలతో రావల్పిండి జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితులు లేవు. కంటిచూపు పోయినా సరే పాక్ ప్రభుత్వం ఆయనపై కనికరం చూపడం లేదు. దాంతో.. మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విజేత అయిన ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని మాజీ ఆటగాళ్లు వరసగా ప్రధానికి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు.