
ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్‌ జలసంధిలో (Strait of Hormuz) ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటన సమయంలో నౌకలో పది మంది సిబ్బంది ఉండగా.. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాధితుడు ఏ దేశానికి చెందినవాడనే విషయం తెలియలేదు. మరోవైపు, ఆ క్షిపణిని ఎవరు ప్రయోగించారనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై అమెరికా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
జావా సముద్రంలో నౌక గల్లంతు.. 140 మంది కోసం గాలింపు
బందర్‌ అబ్బాస్‌ పోర్ట్‌ సిటీకి 22 కి.మీ దూరంలో ఖేష్మ్‌ ద్వీపం ఉంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే నౌకలపై ఇరాన్‌ నియంత్రణ సాధించడంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, హర్మూజ్‌లో ఆటంకం లేకుండా నౌకా రవాణా కొనసాగించేందుకు ఒమన్‌తో కలిసి కృషి చేస్తున్నట్లు చెబుతోన్న టెహ్రాన్‌.. ఇందుకు సంబంధించి పొరుగు దేశాల విదేశాంగ మంత్రులతో సెప్టెంబర్‌ 14న చర్చించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే వాణిజ్య నౌకపై దాడి జరగడం గమనార్హం. అయితే, ఈ సమావేశానికి హాజరు కావడం లేదని బహ్రెయిన్‌ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఏయే దేశాలు పాల్గొంటాయనే విషయంపై స్పష్టత లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






