
ఇంద్రవెల్లి : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ( Ambedkar ) ను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం పోరాడాలని సీఐటీయూ ( CITU ) జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్( Kiran ) పిలుపునిచ్చారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో పాఠశాలలో పని చేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలన్నారు. ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత పాటు కనీస గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.28 వేల ఇవ్వాలన్నారు. విద్యాశాఖ తరపున కార్మికులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంజీవ్, మారుతి, విజయ్, నరహరి, మహేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.






