
మరోవైపు పార్వతి పిల్లలంతా ఆమెపైన పడుకుని ఉంటారు. అవని కాఫీతో వచ్చేసరికి పార్వతి మెల్కుని.. తన పిల్లల్ని చూస్తూ మురిసిపోతుంటుంది. కాన అదేమీ పట్టించుకోనట్లుగా.. కాఫీ ఇస్తుంది తన అత్తగారికి. వీళ్లు రాత్రి చాలా సేపు నాకు కబుర్లు చెప్పారు. ఇందాకే పడుకున్నారు. అందుకే ఎందుకిప్పడం లేపడం అని లేపలేదని అవనితో చెబుతుంది దీంంతో అవని అక్షయ్‌ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే భానుమతి వస్తుంది. మరోవైపు అవని అందరినీ నిద్ర లేపుతుంది. ఆపై అమ్మమ్మగారు మీకు కాఫీ పెట్టిస్తానంటూ అవని వెళ్లబోతుండగా.. కాఫీ సంగతి తర్వాత, ముందు వీళ్లంతా పార్వతి గదిలో ఎందుకు పడుకున్నారని భానుమతి ప్రశ్నిస్తుంది. అమ్మ దగ్గర పడుకోవాలనిపించిందని ప్రణతి చెబుతుంది. మరోవైపు అక్షయ్ కూడా తనకు అమ్మతో ఉండాలనిపించిందని చెబుతాడు. మరోవైపు శ్రీకర్.. అమ్మతో ఉంటే బాగుండనిపించిందని, అమ్మ బాధ పడకూడదని కమల్ చెబుతాడు. మీ అమ్మ ఏదో చిన్న పిల్ల అయినట్లు, మీరేదో బుజ్జగించడానికి వచ్చినట్లు.. కొత్తగా మాట్లాడుతున్నారేంట్రా అని భానుమతి అంటుంది. రెండ్రోజుల నుంచి గమనిస్తున్నాను.. మీరేదో తేడాగా కనిపిస్తున్నారని అంటుంది. ఏదో చెప్పకూడదని ప్రయత్నిస్తున్నట్లు, ఏదో మాకు తెలియని విషయాన్ని దాస్తున్నట్లు, మీ ప్రవర్తన వింతగా ఉందిరా అని చెబుతుంది. దాన్ని తాను గమనిస్తూనే ఉన్నానని పేర్కొంటుంది. ఏంట్రా అది, ఏం జరిగిందో చెప్పండ్రా అని అంటుంది. ఏం లేదు బామ్మా అని కమల్ అనగా.. ఏం లేకపోవడం ఏంట్రా, ముసలి ముసలి అని నన్ను ఊరికే ఆట పట్టించేవాడివి కదా, నన్ను కొట్టేవాడివి కదా, తిట్టేవాడివి కదా.. అలాంటిది నువ్వు నాతో మాట్లాడడం లేదు, నా మొహం చూడడం లేదని భానుమతి చెబుతుంది. మాటలు రాని వాడిలా మౌనంగా ఉంటున్నావు, ఎందుకని అని ప్రశ్నిస్తుంది. ఏరా అక్షయ్.. నీ ముఖంలో చిరునవ్వు తప్ప చిరాకు కనిపించేది కాదు, అలాంటిది నువ్వు కూడా విచారంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. అసలేమైందిరా నీకు అని ప్రశ్నిస్తుంది. తెల్లారి లేచిన దగ్గరనుంచి నువ్వు నీ బాబుని ముద్దులాడుతూ, ఊసులాడుతూ కనిపించేవాడికి.. కానీ ఇప్పుడది ఏం చేయట్లేదని అంటుంది. మరోవైపు మనవరాలిని చూస్కుంటూ.. పుట్టింటికి వచ్చిన ఓ అమ్మాయి అయినా సంతోషంగా, కళకళలాడుతూ ఉంటుంది. కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు. ఏమైందే నీకు అని ప్రణతిని అడుగుతుంది. ఏమైందే మీకు అంటూ మరోసారి అందరినీ కలిపి అడుగుతుంది. దీంతో కమల్.. ఏయ్ ఏంటే ముసలి, ఉదయాన్నే స్పీచులు మొదలెట్టావు, ఏదో రెండ్రోజులు నీకు రెస్ట్ ఇద్దామని నిన్ను పట్టించుకోవడం మానేశానే, అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేకపోయానన్న ఫీలింగ్‌తో అలా ఉన్నాను నానమ్మ అని ప్రణతి, నిన్ను ఆట పట్టించడం కాదే.. నీతో చాలా పనులు చేయించుకోవాలి పదా పదా అంటాడు కమల్. ముఖ్యంగా తలంటు పోయించుకోవాలి, స్నానం చేయించుకోవాలంటూ లిస్ట్ చెబుతాడు. ఏయ్ వదులు అంటూ భానుమతి సీరియస్ అవుతూ.. తలంటడాలు, వీపు రుద్దడాలు వంటివి నీ పెళ్లాంతోనే చేయించుకోవాలని చెబుతుంది. నేను చేయడం ఏంట్రా, దొంగ వెధవ అని ప్రశ్నిస్తుంది. దొంగ వెధవ అన్నావు కాబట్టి.. నా బట్టలు కూడా నువ్వే ఉతకాలంటూ బామ్మను తీస్కుని బయటకు తీసుకెళ్తాడు. ప్రణతి మీ నానమ్మ ఏదో అన్నందుకు, వాడు మీ నానమ్మను ఏడిపించేలా ఉన్నాడు, వెళ్లి చూడమ్మా అని పార్వతి చెప్పగా ప్రణతి వెళ్లిపోతుంది. దీంతో అవని.. అత్తయ్యా.. మీ కాఫీ చల్లారిపోయి ఉంటుంది, మీకు మళ్లీ తీసుకువస్తానంటూ కాఫీ తీస్కొని కిచెన్‌లోకి వెళ్తుంది. మరోవైపు కమల్ కూడా వెళ్లగా.. అక్షయ్ తన తండ్రి ఫొటోను టేబుల్‌పై పెడతాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్షయ్ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా.. అవని వస్తుంది. ఏవండి.. మామయ్యగారి చితాభస్మాన్ని ఎప్పుడు గంగలో కలపాలనుకుంటున్నారని అడగ్గా.. చూద్దాం అంటాడు అక్షయ్. కానీ అలా చితాభస్మాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని అవని చెప్పగా.. ఎందుకుండకూడదని అక్షయ్ అడుగుతాడు. దీంతో మన హీరోయిన్ అవని.. అది పవిత్రమైనదిని, అందుకే పవిత్రమైన గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర జలాల్లో కలుపుతారని చెబుతుంది. ఇట్లో ఉంచితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా రకాల కారణాలతో అది అపవిత్రమైపోయే అవకాశం ఉంటుందండి అని భర్తకు వివరిస్తుంది. అలా జరిగిత చనిపోయిన వాళ్ల ఆత్మ ఘోషిస్తుంది అని అంటారని పేర్కొంటుంది. అందుకే చాలా మంది చితాభస్మాన్ని శ్మశానంలోనే పెట్టి అక్కడి నుంచే నేరుగా తీసుకు వెళ్తారని అంటుంది. దీంతో అర్థమైందని చెప్పిన అక్షయ్.. నాన్నగారి పవిత్ర ఆత్మ కోసం, అపవిత్రం కాకముందే ఈ చితాభస్మాన్ని తీసుకెళ్లి గంగానదిలో కలిపేయాలిగా, చేసొస్తాను అంటాడు. మరోవైపు కమల్.. భానుమతితో తలంటు పోయించుకుంటాడు. బామ్మా మొదలెట్టవే అంటూ మసాజ్ చేయించుకుంటాడు. కానీ ఆమె స్నానం చేయింస్తుండగా.. విపరీతంగా బాధ పడిపోతాడు. అదేమీ తెలియని భానుమతి.. రేయ్ ఈ వయసులో నాతో ఇలాంటి పనులు చేయిస్తున్నావ్ సిగ్గులేదా అని అడగ్గా.. నాకు సేవ చేయడం అదృష్టం అని అనుకోకుండా, విసుక్కుంటావేంటే అని అంటాడు. ఈ కబుర్లకేం తక్కువ లేదని బానుమతి అంటుంది. నుప్పు చంటి సినిమా చూశావా అని కమల్ అనగా.. వెంకటేష్ నా ఫేవరెట్ హీరోరా నాలుగు సార్లు చూశాను ఆ సినిమాని అని చెబుతుంది. అందులో వెంకటేష్ నూనె రాసి, స్నానం చేయించే సీన్ గుర్తుందా అనగా.. ఎందుకు గుర్తులేదురా, నాలుగు సార్లు చూశానని చెప్తున్నాను కదా అంటుంది. అయిదే అందులో వెంకటేష్ లాగానే తనకి నూనె రాసి, స్నానం చేయిస్తూ.. ఓ పాట పాడమని బామ్మను అడుగుతాడు. ఏయ్ నాకు రాదని, వచ్చినా నేను పాడమని భానుమతి అనగా.. అయితే నువ్వు వెంకటేష్ ఫ్యాన్‌వి అన్న విషయం అబద్ధన్నమాట అని కమల్ అంటాడు. దీంతో ఏయ్.. ఫ్యాన్స్‌ను ఇన్సల్ట్ చేశావంటే.. హీరోని అవమానించినట్లేరా అని చెబుతుంది. అయితే నాకోసం కాకపోయినా, నీ హీరో కోసమైనా పాడమని అంటాడు కమల్. దీంతో చేసేదేమీ లేక భానుమతి పాట పాడేదుకు సిద్ధం అవుతుంది. తైలం పట్టి, తాళం పట్టి అనగా.. నాకింక తర్వాత గుర్తులేదురా అంటుంది భానుమతి. దీంతో గుర్తున్నా పాడకే అని కమల్ అంటాడు. యే అనగా.. వీధిలో ఉన్న కుక్కలు ఇంట్లోకి రావడం నాకస్సలే ఇష్టం లేదని అనగా.. తలపై కొడుతుంది భానుమతి. నిజం చెప్తే కొడ్తావేంటే అని కమల్ అడగ్గా.. నేను అందుకు కొట్టలేదని, నాకు తెల్సిన విషయమే మళ్లీ చెప్పినందుకు కొట్టానని కమల్ అంటాడు. అయితే నువ్వు కొట్టింది నాకు నచ్చిందని అంటాడు. ఏంటే ముసలి.. నీతో ఈ పనులు చేయించుకుంటున్నానని ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. దీంతో భానుమతి.. లేదురా, నీది అచ్చం నీ తాత పోలిక, నీకు ఏం చేయినా ఆనకు చేసినట్లే అని మురిసిపోతానంటుంది. పైనున్న మీ తాతయ్య కూడా సంతోషిస్తారురా అని చెబుతుంది. మీ నాన్నకు కూడా చిన్నప్పుడు నేనే తలంటేదాన్ని, పెద్దయ్యాక కూడా అప్పుడప్పుడూ నేనే తలంటేదాన్ని అని చెబుతుంది. దీంతో కమల్ మళ్లీ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు అదేమీ తెలియని భానుమతి.. నా కొడుకును చూడక చాలా రోజులు అయిందిరా అంటుంది. నీకు తలంటు పోస్తే వాడుకు పోసినట్లుగానే సంతోషంగా ఉందిరా అని భానుమతి వివరిస్తుంది. నా కొడుకంటే నాకెంత ఇష్టమో.. నువ్వంటే కూడా అంతే ఇష్టం రా అని చెబుతుంది. అందుకే నువ్వు నన్ను తిట్టినా, విసుక్కున్నా.. నీ మీద నాకు కోపం రాదురా అంటుంది. అలా అని నీ మీద ఉన్న ప్రేమ కూడా తగ్గదురా అని భానుమతి వివరిస్తుంది. రాత్రంతా మీ నాన్నే కల్లోకి వచ్చాడురా, ఆశ్రమం నుంచి త్వరగా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పడంటూ మురిసిపోతుంది. ఒరేయ్ తెల్లవారి జామున వచ్చే కలలు నిజమవుతాయంటారురా, అందుకే నా కొడుకు త్వరగా వచ్చేస్తాడని నేను చాలా సంతోషంగా ఉన్నానురా అని చెబుతుంది. దీంతో కమల్‌కు బాధ ఎక్కవై కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన భానుమతి.. రేయ్ ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావురా అంటూ మళ్లీ టెన్షన్ పడిపోతుంది. దీంతో కమల్.. నూనె కళ్లల్లోకి వెళ్లి, కళ్లు మండుతున్నాయని చెబుతాడు. అవునా అంటూ భానుమతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. రేయ్ కమల్.. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనురా అటూ ప్రేమగా మనడికి స్నానం చేయిస్తుంది. మరోవైపు పల్లవి హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. శ్రీరామ్ అమ్మగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వారి ఇంట్లోకి ఆటో రాగా.. అందులో శ్రీరామ్ తల్లి కనిపిస్తుంది. దీంతో పల్లవి పరుగున డోర్ వద్దకు వెళ్లి.. వీళ్లు ఎవరికైతే పిండప్రధానం చేశామని చెప్పారో, ఇప్పుడు ఆవిడ వచ్చిందని అంటుంది. ఇప్పుడు వీళఅలు ఎలా తప్పించుకుంటారో చూద్దామని అనుకుంటుంది. మరోవైపు అప్పుడే హాల్లోకి అక్షయ్ చితాభస్మంతో వచ్చి.. కమల్, శ్రీకర్ అంటూ తమ్ముళ్లను పిలుస్తాడు. మీ ఫ్రెండ్ అమ్మగారి చితాభస్మాన్ని గంగలో కలిపేస్తే కార్యం పూర్తవుతుందని చెబుతాడు. వెళ్దామా అనగానే.. మకల్ తల ఊపుతాడు. శ్రీకర్ అమ్మా వెళ్లొస్తాం అంటాడు. దీంతో భానుమతి మరోసారి ఫైర్ అవుతుంది. ఎవరో తెలియని వాళ్లు పోతే అంత్యక్రియలు చేయడం, పిండప్రధానం చేయడం ఏంటి, ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టేటట్టే ఉందని చెబుతుంది. అత్తయ్యా.. తథాస్తు దేవతలు ఉంటారు, అలా అనకండని చెబుతుంది. నేను అనడం కాదే.. జరగకూడదనిది అంతా జరిగాక, మీకే తెలుస్తుందిలే అని భానుమతి కోడలితో అంటుంది. అంతలోనే శ్రీరామ్ తల్లి లోపలికి వస్తుంటుంది. ఆమెను చూడగానే అక్షయ్, శ్రీకర్, కమల్ నోరెళ్లబెడతారు. మరోవైపు పార్వతి, అవనిలు సైతం షాక్ అవుతారు. కానీ పల్లవి మాత్రం తెగ సంబురపడిపోతూ నవ్వుకుంటుంది. ఇంతలోనే శ్రీరామ్ తల్లి.. నేనెవరో తెలియనట్లుగా అలా చూస్తున్నారేంటని ప్రశ్నిస్తుంది. పార్వతి ఇంకా షాక్ నుంచి కోలుకోకముందే.. భానుమతి ఎవర్రా ఈవిడ అని అడుగుతుంది. మరోవైపు శ్రీరామ్ తల్లి.. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది పార్వతి గారు అని అడుగుతుంది. మీరు, మీరు లక్ష్మమ్మ కదూ అంటుంది. అవును మనం కలిసి ఆరేళ్లు అయింది, అందుకే గుర్తు పట్టలేరనుకుంటా అంటుంది ఆమె. దీంతో ఈరోజు సీరియల్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ