
Indiramma houses | హైదరాబాద్, సెప్టెంబర్ 15 : హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 20, 2026 వరకు పొడిగించారు. రెండో శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర వరుస సెలవుల కారణంగా దరఖాస్తుల గడువును పొడిగించాలని వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయి. వాటిని పరిశీలించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి. గౌతమ్, ఐఏఎస్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలైన చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ముగిసినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వరుస సెలవులు, పండుగలను దృష్టిలో ఉంచుకొని గడువును సెప్టెంబర్ 20, 2026 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని, సెప్టెంబర్ 20లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని వి.పి. గౌతమ్ విజ్ఞప్తి చేశారు. పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు tghb.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్ హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు