
Indigo Goa Delhi Flight Returns To Airport After Mid Air Engine Failure
ఇంటర్నెట్ డెస్క్: గాల్లో ఉన్న సమయంలో ఇండిగో విమానం (IndiGo) ఇంజిన్లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గాల్లో ఉన్న సమయంలో ఇండిగో విమానం (IndiGo) ఇంజిన్లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 9:16 గంటలకు ఇండిగో విమానం గోవా నుంచి దిల్లీ (Goa-Delhi) బయల్దేరింది.
గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఇంజిన్లో సమస్య (Engine Failure) తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చారు. దీంతో గోవా ఎయిర్పోర్టులో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్లు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు.
తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు.






