
ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో మెడికేర్ పథకాన్ని దుర్వినియోగం చేసి (Health Care Fraud) వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడని భారత సంతతికి చెందిన ఓ ల్యాబ్‌ యజమానిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన టెక్సాస్‌ అధికారులు అతడు పరారీలో ఉన్న వ్యక్తుల జాబితాలో (Fugitive) చేర్చారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అమెరికా ఆరోగ్య సేవల విభాగాధికారుల ప్రకారం.. ఖాదీర్‌ ఖాన్‌ మహ్మద్‌ (46) టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో ఓ జన్యుపరీక్షల ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 2023-అక్టోబర్‌ 2024 మధ్యకాలంలో జన్యు పరీక్షల కోసం దాదాపు 93 మిలియన్‌ డాలర్ల మెడిక్లెయిమ్‌ల (Medicare claims) కోసం దరఖాస్తు చేయించగా.. 65 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.620 కోట్లు) క్లెయిమ్‌ అయ్యాయి. వెంటపడి వేధించి.. భారత సంతతి యువతిని హత్య చేసి.. చివరకు! అయితే, జన్యు పరీక్షలకు వైద్యులు సూచించకున్నా, లబ్ధిదారులకు చికిత్స చేయకున్నా ఈ క్లెయిమ్‌లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్యుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి నిందితులు మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీనిలో ఖాదీర్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులు అతడిపై అభియోగాలు మోపి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతడిని మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





