
ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై భారత్ 183/5 పరుగుల కొండంత స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో 129 పరుగుల శుభారంభం ఇచ్చారు. చివర్లో కమాలిని (15 నాటౌట్) ధాటిగా ఆడటంతో భారత్.. శ్రీలంక ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
