
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించిన వేళ భారత ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్‌కు ఐసీసీ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచ్ తొలి ఓవర్లో లంక ఓపెనర్ ఇమేషా దులానీ వికెట్ తీసిన అనంతరం పెవిలియన్ వైపు వెళ్లాలని సైగ (సెండ్-ఆఫ్) చేసింది. అయితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఆమె మ్యాచ్ ఫీజులో 10% కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించారు. క్రాంతి తన తప్పును ఒప్పుకోవడంతో దీనిపై విచారణను ముగించింది.