
ఇంగ్లండ్ పర్యటనలో మోకాలి గాయం బారిన పడిన 32 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పూర్తి చేసుకుని తిరిగి మైదానంలోకి దిగాడు. అఫ్గానిస్థాన్‌తో తలపడుతున్న టీ20 పోరులో బౌలింగ్ ప్రారంభించిన అతడు, మొదటి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) ను పెవిలియన్‌కు పంపాడు. హార్డ్ లెంగ్త్ బంతితో గుర్బాజ్‌ను బోల్తా కొట్టించగా, మొదటి స్లిప్‌లో ఉన్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ వికెట్‌తో భారత క్రికెట్ జట్టు (Team India) తరఫున బుమ్రా టీ20 ఫార్మాట్లో సరికొత్త మైలురాయిని తాకాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు సైతం దూరమైన ఈ పేస్ గుర్రం, రీఎంట్రీ మ్యాచ్‌లోనే తనదైన శైలిలో వికెట్ ఖాతా తెరిచి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.






