
IND vs WI: భారత క్రికెట్ జట్టు తదుపరి పోరుకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా ముందుగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుండగా దీనికి సంబంధించిన జట్టును బీసీసీఐ ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఏషియన్ గేమ్స్ కూడా జరుగుతుండటంతో, టీ20 ఫార్మాట్లో ఆడే కొందరు కీలక ఆటగాళ్లు వన్డే జట్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.