
శంషాబాద్‌: శంషాబాద్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఓ కారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అప్రోచ్ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి రోడ్డుకు అవతలి వైపు పడింది. అదే సమయంలో ఎదురుగా వేగంగా హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్ బస్సు స్తంభాన్ని ఢీ కొట్టడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌లో టీ తాగుతున్న కరీంనగర్‌కు చెందిన అజీముద్దీన్ (29) అక్కడిక్కడే మృతి చెందాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.