
రుణాల అన్వేషణకు ముమ్మర ప్రయత్నాలు అక్టోబరు నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు మొదటిదశ స్వాధీన ప్రక్రియను సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. రుణ సేకరణ కొలిక్కి రాకపోవడంతో మరింత ఆలస్యం కానుంది. దీంతో షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌(ఎస్‌పీఏ) పూర్తికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. తక్కువ వడ్డీకి రుణమిచ్చే సంస్థలు ముందుకొస్తే.. అక్టోబరులోనే సంబంధిత ప్రక్రియను పూర్తి చేస్తామనే ధీమాని మెట్రోరైలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌ఎఫ్‌సీతోనే సంప్రదింపులు..: ఎస్‌బీఐ క్యాప్స్‌ కొత్త రుణ సంస్థ కోసం అన్వేషణ చేస్తుండగా.. మెట్రోరైలు అధికారులు గతంలో ముందుకొచ్చిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రోరైలు స్వాధీనానికి కావాల్సిన రూ.13,527 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ తొలుత ముందుకొచ్చింది. ఒప్పందాలు కూడా పూర్తయ్యాక ఆగిపోయిన సంగతి తెలిసిందే. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



