
మీరు మీ భర్త వివరాలు మాత్రమే ఇచ్చారు. మీ వివరాలను ఇక్కడ పేర్కొనలేదు. మీ శ్రీవారి జాతకంలో లగ్నంలో కుజ- రాహువు ఉన్నారు. దీన్ని కుజ- రాహు సంధి దోషం, కుజ దోషం, రాహు- కేతు దోషంగా పరిగణించాలి. వీటి ప్రభావం వల్ల మూర్ఖత్వం, కోపం, ఆవేశం వంటివి జాతకంలో కనిపిస్తుంటాయి. అయితే, శుక్రుడు- గురుడు- చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మిగిలిన సమయాల్లో ఇవి శుభ, అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ జాతకం వృత్తి, ఉద్యోగం, ధనపరంగా అనుకూలం. వైవాహిక జీవితపరంగా ప్రతికూలంగా ఉంది. కాబట్టి కొన్ని ఒడుదొడుకులు సహజం. మీ భర్తతో వాదనలకు దూరంగా ఉంటూ ఆయన్ను ఆవేశానికి గురిచేయకుండా, నొప్పించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకెళ్లండి. కొన్ని పరిహారాలను మీ దంపతులిద్దరూ ఆచరించడం, మరీ ముఖ్యంగా మీ వారితో చేయించగలిగితే కొంతమేర దోష నివృత్తి జరిగి అన్యోన్యంగా ముందుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. బెంగళూరు సమీపంలోని ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి అభిషేకం జరిపించండి. శ్రీకాళహస్తిలో రాహు- కేతు పూజలు చేయించండి. నీలం, గోమేధికం, కనకపుష్యరాగం ఉంగరాలను ధరింపజేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయించండి. ఈ పరిహారాలను పాటించడం వల్ల దోష నివృత్తి జరిగి శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.