
House Walls Cracks: భవనాలలో పగుళ్లు చాలా సాధారణ సమస్య. ఇవి గోడలు, ప్లాస్టరింగ్, బేస్మెంట్లు, బీమ్‌లు, స్లాబ్‌లు, కాలమ్‌లలో కనిపిస్తాయి. చాలామంది పగుళ్లు వచ్చినప్పుడు కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే చూస్తుంటారు. కానీ వాటి మూలకారణాన్ని గుర్తించి పరిష్కరించకపోతే అవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. పగుళ్లను రెండు ప్రధాన రకాలుగా విభజించవచ్చు. స్ట్రక్చరల్, నాన్-స్ట్రక్చరల్. స్ట్రక్చరల్ పగుళ్లు భవన స్థిరత్వానికి ప్రమాదకరమైనవి. అయితే నాన్-స్ట్రక్చరల్ పగుళ్లు సాధారణంగా మైనర్‌గా ఉంటాయి. ఈ సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ఇంటి యజమానులకు, సివిల్ ఇంజనీర్లకు, నిర్మాణ విద్యార్థులకు చాలా అవసరం. అయితే మేస్త్రీలు, బిల్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం..





