
బంగాళాఖాతంలోని అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పటాన్చెరు, లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ప్రాంతాలను భారీ వర్షం కురవగా.. రాజేంద్రనగర్, మణికొండ, అత్తాపూర్ నుంచి ఖైరతాబాద్, అమీర్పేట, నాంపల్లి, బేగంపేట, జూబ్లీహిల్స్, గోల్కొండ, టోలిచౌకీ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
Recommended for you

politicsఖురాన్ హెచ్చరికలు!




