
అసెంబ్లీలో 22ఏ భూములు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో పుట్టారని, ప్రజల భూములు దోచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలు అని ప్రచారం చేసిన రేవంత్, ఇప్పుడు 60 ఎకరాలు అని మాట్లాడటం ఆయన అబద్ధాలకు నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ ఉందని, కేసీఆర్‌కు హైదరాబాద్‌లో సొంత ఇల్లు కూడా లేదని హరీశ్ రావు విమర్శించారు.