
మహారాజ్ నీమ్ కరోలి బాబా బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అంశ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 236 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇంత భారీ విజయంపై 21 ఏళ్ల యువ నిర్మాత అనుప్రియ నాగర్ స్పందిస్తూ.. వచ్చిన లాభాలను పేద పిల్లల విద్య, స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తానని ప్రకటించారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూ. 100 కోట్ల ఓటీటీ డీల్ ప్రచారాన్ని చిత్ర సహ నిర్మాత రాగిణి సోనా పూర్తిగా ఖండించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో తెలుగులో విడుదల కానుంది.




