
కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ పేరుతో వచ్చిన ఈ డివోషనల్ మూవీ అనూహ్యంగా 200 కోట్ల క్లబ్లో చేరి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బడ్జెట్‌కు వంద రెట్లు వసూళ్ల సాధించిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నయా రికార్డ్ సెట్ చేసింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర, బోధనల ఆధారంగా తెరకెక్కిన సినిమా హనుమాన్ అంశ్. ఈ డివోషనల్ డ్రామా తొలి రోజు కేవలం 10 లక్షల కలెక్షన్స్‌తో మొదలైంది. రెండు వారాల పాటు సైలెంట్‌గా ఉన్న ఈ మూవీ మూడో వారం నుంచి దూసుకుపోతోంది. బాలీవుడ్ ‘మీర్జాపూర్ ద మూవీ’, ‘హైవాన్’ లాంటి క్రేజీ మూవీస్ రిలీజ్ అయినా వాటిని మించి పర్ఫామ్ చేస్తోంది హనుమాన్ అంశ్. శోభినావ్ సత్య, విహాన్ షెడ్గే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అయిన ఖర్చు కేవలం 2 కోట్లు. కానీ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఏకంగా 100 రెట్ల లాభాలను అందించింది. గతంలో 15 కోట్ల బడ్జెట్‌తో వచ్చి రికార్డులు క్రియేట్ చేసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వసూళ్ల రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసి.. 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన అతి తక్కువ బడ్జెట్ చిత్రంగా, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. స్టార్ హీరోలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటేనే సినిమాలు ఆడుతాయి అనుకునే రోజుల్లో.. ప్యూర్ కంటెంట్, డివోషనల్ టచ్‌తో ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా నిరాశపరుస్తున్న ఈ టైమ్‌లో, ఈ సినిమా మాత్రం ఆరో వారంలోనూ హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. దీంతో ఈ సినిమా మరిన్ని మైల్‌స్టోన్స్ రీచ్ అవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి టాలీవుడ్లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు! గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్! Gold Price today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే! పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా? USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్





