
కూరల్లోకి పచ్చిమిరపకాయలు కావాల్సినప్పుడు మార్కెట్కు వెళ్లే పని లేకుండా పెరట్లోనే లేదా బాల్కనీలో ఒక్క చిన్న మిరప మొక్క ఉంటే ఎంతో బాగుంటుంది కదా..చాలామంది ఇంట్లో మొక్కలు పెంచాలంటే పెద్ద స్థలం లేదా తోట కావాలని అనుకుంటారు. కానీ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చిన్న కుండీలోనే, మన బాల్కనీ లేదా కిటికీల దగ్గర పచ్చిమిర్చి మొక్కలను సులభంగా పెంచి తాజా కాయలను కోసుకోవచ్చు. వంటగదిలోని ఎండుమిర్చి గింజలతోనే కుండీల్లో పచ్చిమిర్చి ఎలా పండించవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.