
హైదరాబాద్, సెప్టెంబర్ 15: పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా సందర్భం ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. బంగారానికి మన సంస్కృతి, సంప్రదాయాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి మంచి సాధనం. ఇక ప్రస్తుత రోజుల్లో బంగారంతోపాటు వెండికీ మంచి గిరాకీ ఉంది. అందుకే అలంకార ప్రియులైన అమ్మాయిలతోపాటు వ్యాపారం చేసే బిజినెస్ మెన్లు కూడా ఎప్పటికప్పుడు వీటి ధరలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..