
పదవులు కాదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే తమ లక్ష్యమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ తర్వాత కాంగ్రెస్‌ కార్యకర్తలతో తొలిసారిగా కొండా సురేఖ దంపతులు సమావేశమయ్యారు. ‘‘కొందరు ఉదయం ఒకపార్టీలో మధ్యాహ్నం మరో పార్టీలోకి వెళ్తున్నారు. గతంలో కొందరు గుంటనక్కలు మాకు టికెట్‌ రాకుండా చేశారు. నాడు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చినందుకు నాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించాం’’అని కొండా సురేఖ అన్నారు.






