
హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ పనులపై జీహెచ్‌ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం. సుమారు రూ. వెయ్యి కోట్లతో ఏడు అండర్‌ పాస్‌లు, ఏడు ఫ్లైఓవర్‌లు నిర్మించేందుకు పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. ఈ క్రమంలో వాహనదారులకు ఆటంకం లేకుండా వన్‌ వే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం సత్ఫలితాల్ని ఇస్తుండటంతో ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌పై పునరాలోచనలో పడిందని భోగట్టా. ఈ పరిణామాలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో...





