
చెరకు తోటలో ఎవరో విసిరేసిన పసికందును చూసి చలించిపోయారు సంజీవ్‌ కుమార్‌ సిన్హా. ఆ పాపని గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకెళ్లారు. భార్య అనురితా కుమారితో కలిసి పాపను కంటికిరెప్పలా కాపాడారు. ఆకాంక్ష అని పేరు పెట్టారు. ఇప్పుడా చిన్నారి మూడో తరగతి చదువుతోంది. బిహార్‌లోని పరవల్పూర్‌ బ్లాక్‌ కార్యాలయంలో అంజు కుమారి అనే ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలికను కన్నవాళ్లు వదిలేస్తే.. ఇంటికి తీసుకొచ్చి కూతురిలా పెంచి ఇంటర్‌ వరకు చదివించారు. పెళ్లికి రూ.3 లక్షలు ఖర్చు చేశారు. పక్కింటి బాలుడు అభిషేక్‌ చిన్నతనంలో తీవ్రమైన న్యుమోనియాతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు కూడా సంజీవ్‌ కుటుంబం ఆదుకుంది. ఇలాంటి పనుల కోసం తమ పిల్లల కోసం దాచిన పొదుపు మొత్తాలను ఖర్చు చేయడమే కాకుండా రాజ్‌గిర్‌లోని సుమారు రూ.40 లక్షల విలువైన ఆస్తిని సైతం అమ్మేశారు సిన్హా. ఇంత చేసి కూడా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే డబ్బుతో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని సంజీవ్‌ భావిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.