
ఉదయం ఆరింటికే ఆ మెకానిక్‌ ‘డ్యూటీ’ మొదలవుతుంది. అతడి చేతిలో పనిముట్లకు బదులు చిరుధాన్యాలుంటాయి. కస్టమర్లు కాకుండా వందలకొద్దీ చిలుకలు ఆయన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆయన రాగానే కిలకిలారావాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోతుంటుంది. ఈ దృశ్యం శివగంగ సమీపంలోని పయ్యూర్‌ అరగసు అమ్మన్‌ ఆలయం వద్ద 25 ఏళ్లుగా ఆవిష్కృతమవుతోంది. ఆ చిలుకల కోసం రోజూ ఎదురుచూసే వ్యక్తి నేసన్‌ మునియాండి. వృత్తి మోటార్‌ మెకానిక్‌ అయినా స్థానికంగా ‘చిలుకల ప్రేమికుడు’ అనే పేరుంది. తను ఇంటి సమీపంలో నాటిన మర్రిమొక్క పెరిగి పెద్దదైంది. అదే చెట్టు కింద వందల చిలుకలు గుమిగూడుతున్నాయి. వాటి ఆకలి తీర్చడానికి 200 కిలోల వరకు బియ్యం, చిరుధాన్యాలు నిల్వ ఉంచుతారాయన. మనుషుల స్వార్థం కోసం ఎడాపెడా చెట్లు కొట్టేస్తున్న కాలంలో.. ఓ మెకానిక్‌ మాత్రం ఒక చెట్టును పెంచి, దాని నీడలో వేల చిలుకలకు ‘భోజనశాల’ నడుపుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.