
బాలికల విద్య, మహిళలకు రాజకీయ అవకాశాల్లో పురోగతి గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-2026ను విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక జెనీవా: అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో భారత దేశం గతంలో మాదిరిగా 131 స్థానంలో నిలిచిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత అట్టడుగున మరో 14 దేశాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రపంచంలోని 145 దేశాల్లో లింగ సమానత్వ స్థితిగతుల సమాచారంతో గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-2026ను డబ్ల్యూఈఎఫ్‌ బుధవారం విడుదల చేసింది. ఈ సూచీలో ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు ఎప్పటిలా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. లింగ సమానత్వంలో ఐస్‌లాండ్‌ వరుసగా 16వ సారి తొలి స్థానంలో నిలిచింది. 2006 నుంచి తాము పర్యవేక్షిస్తున్న దాదాపు ప్రతి ఆర్థిక వ్యవస్థ లింగ సమానత్వంలో పురోగతి సాధించిందని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. అయితే, పూర్తి లింగ సమానత్వం సాధనకు 120 ఏళ్లు పట్టవచ్చని అంచనా వేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఇంజినీర్లలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారని డబ్ల్యూఈఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదియా జాహిది తెలిపారు. ఏఐ సంస్థలలో ప్రతి స్థాయిలో మహిళ ప్రాతినిధ్యం తక్కువగా ఉందని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.