
విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్‌ హైదరాబాద్, న్యూస్‌టుడే: దోచుకో.. దాచుకో అనేదే భారాస సిద్ధాంతమని, కల్వకుంట్ల కుటుంబం భూములపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్‌ అన్నారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పదేళ్లు, తెలంగాణ వచ్చాక పదేళ్లు దోచుకొని, దాచుకున్నారని ఆరోపించారు. వీరు బుధవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ మీడియాహాలులో మాట్లాడారు. ‘కల్వకుంట్ల కుటుంబం భూ దోపిడీని సీఎం ఆధారాలతో సహా బయటపెట్టారు. భూ దోపిడీపై హరీశ్‌రావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో వారికున్న భూములెన్ని, ఇప్పుడు ఎన్ని? వారి బినామీల పేరుతో ఉన్న భూములను కూడా బయటపెడతాం. హరీశ్‌రావు.. మీ స్థాయికి మా ముఖ్యమంత్రి రారు. ప్రభుత్వ విప్‌లం మేం చర్చకు సిద్ధం. రేవంత్‌రెడ్డికి 308 ఎకరాల భూమి ఉందని హరీశ్‌రావు అంటున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలుంటే బయటపెట్టాలి’ అని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.