
ముంబయి: దసరా, దీపావళి పండగల సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీలను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) పెంచింది. ఒక్కో పసిడి ఆభరణానికి హాల్‌మార్కింగ్‌ వేసేందుకు వసూలు చేసే ఫీజును రూ.45 నుంచి రూ.75కు పెంచుతూ నోటిఫై చేసింది. వెండి వస్తువుల హాల్‌మార్కింగ్‌ ఫీజును మాత్రం రూ.35 వద్ద యథాతథంగా కొనసాగించింది. ఈ మార్పులను వెంటనే అమల్లోకి తెచ్చినట్లు బీఐఎస్‌ వెల్లడించింది. ఆభరణాల వ్యాపారులు గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్‌మార్కింగ్‌ కేంద్రాలకు పంపే ప్రతి పసిడి వస్తువుకు రూ.75 ఫీజు చెల్లించాలి. ఒక కన్‌సైన్‌మెంట్‌కు కనీస ఛార్జీగా రూ.200గా ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





