
ప్ర ముఖ నటులు జ్యోతిక, సూర్య తమ 20ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని ఇటీవల ఘనంగా చేసుకున్నారు. ఈ జంట మరోసారి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో క్రైస్తవ మత పద్ధతిలో పెళ్ళి చేసుకుని... తమ వివాహం నాటి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ ఈ జోడీ.. ‘‘ది సీక్వెల్‌- మా 20ఏళ్ల ప్రేమ, యుద్ధానికి గుర్తుగా ప్రమాణాలను పునరుద్ధరించుకునే వేడుక. ఇది పరిపూర్ణమైన వివాహాన్ని చేసుకునే వేడుక మాత్రమే కాదు.. త్యాగాలు, సర్దుబాట్లు, నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించుకునేందుకు చేసుకునే వేడుక. ఒకరికోసం మరొకరు మారిన వ్యక్తిత్వాలకు ప్రతీకగా చేసుకునే వేడుక’’అనే క్యాప్షన్‌ని జోడించారు. 2006 సెప్టెంబరు 11న సూర్య, జ్యోతికల వివాహం జరిగింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





