
సొంత ఇల్లు... ప్రతి ఒక్కరి కల. దాన్ని దగ్గరుండి తీర్చిదిద్దుకోవడం ప్రతి ఇల్లాలూ ఇంకా ఇష్టంగా చేసే పని. సొం త ఇల్లు... ప్రతి ఒక్కరి కల. దాన్ని దగ్గరుండి తీర్చిదిద్దుకోవడం ప్రతి ఇల్లాలూ ఇంకా ఇష్టంగా చేసే పని. డెకార్, వస్తువులేనా? రంగులు ఎంచుకోవడమూ పెద్ద టాస్కే! ఏం వేయాలా అని తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ చిన్ని ప్రశ్నలు వేసుకోండి... ఫలానా రూమ్‌లోకి వెళ్లినప్పుడు మీకే భావన కలగాలి? అంటే ప్రశాంతంగా, ఉత్సాహంగా, హాయిగా... ఇలా ఏమనిపించాలో ఆలోచించుకోండి. దాని ఆధారంగా ఏ రంగులు నప్పుతాయో సరిచూసుకుని ఎంచుకోవడమే! వార్డ్‌రోబ్‌ ఒకసారి తెరవండి. సాధారణంగా ఏ రంగు దుస్తులు మెచ్చుతారు? వేటితో సౌకర్యంగా ఫీలవుతారో చూసుకోండి. ఆ షేడ్‌లను మెచ్చుతున్నారంటే... చుట్టూ ఉండేవాటిల్లోనూ వాటిని మెచ్చుతారనే! నచ్చినవి ఎంచుకుంటే తరవాత పశ్చాత్తాప పడాల్సిన పనిలేదు. కళ్లకీ, మనసుకీ నచ్చితే సరిపోదు. గచ్చు, టైల్స్, డెకార్‌ ఆఖరికి కర్టెన్లకీ జత కుదరాలి. కాబట్టి, కేవలం పుస్తకాల్లో చూసి బాగుందని ఎంచుకోవద్దు. మిగతా రంగులు, మెటీరియళ్లతో జోడీ కుదురుతోందా అనీ గమనించుకోవాలి. గమనించారో లేదో కొన్ని కలర్స్‌ వెలుగుని బట్టి ఒక్కోలా కనిపిస్తాయి. ఉదయపు కాంతిలో ఒకలా కనిపిస్తాయి. మధ్యాహ్నం, సాయంత్రాలకి మరోలా తోస్తాయి. అందుకే చిన్న శాంపిల్‌ చూసి నిర్ణయించుకోవద్దు. ఏదైనా గోడపై నేరుగా కాస్త పెద్ద మొత్తంలో వేసో, పేపర్‌ అతికించో రోజంతా గమనించాలి. తరవాతే నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు కర్టెన్లు, కవర్లవరకూ అంటే సరే. ఫర్నిచర్‌ మొత్తాన్నీ ఎక్కడ మార్చగలం? కాబట్టి, వేసేవి ఏవైనా వాటికీ నప్పాలి. అప్పుడే అసలైన అందం. సులువుగా లేదూ? అందుకే ఈ ప్రశ్నలు వేసుకోండి. అన్నింటికీ సమాధానాలు దొరికాయి అనిపిస్తే నిశ్చింతగా వాటితో ఇంటిని తీర్చిదిద్దుకోండి. త్వరగా బోర్‌ కొట్టవు. పైగా ఆస్వాదిస్తారు. ప్రయత్నిస్తారు కదూ? .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings




