
మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదనాచారి. చిత్రంలో దేశపతి శ్రీనివాస్, ఎల్‌.రమణ, సురభి వాణిదేవీ ఈనాడు, హైదరాబాద్‌: సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని శాసన మండలి భారాస ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసమే మండలిని నడిపినట్లు ఉందని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవీ, ఎల్‌.రమణ, దేశపతి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘శాసన సభకు స్పీకర్‌గా పనిచేశాను. ఎప్పుడూ ఇలా సభ జరిగిన తీరు చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి పోలీసు బలగాలను మోహరించలేదు. లైవ్‌ ప్రసారాల్లో కూడా మాపై వివక్ష కొనసాగించారు. ఆరు వాయిదా తీర్మానాలను ఇస్తే అన్నింటిని తిరస్కరించారు. 20 అంశాలను చర్చకు ప్రతిపాదించిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మండలి జరిగిన తీరుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’’ అని పేర్కొన్నారు. వాణిదేవీ మాట్లాడుతూ ‘‘మహిళా ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. ఇది తెలంగాణకు అవమానం కాదా?’’ అని ప్రశ్నించారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనపై సభలో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





