
దిల్లీ: చైనాకు ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ దేశంతో సంబంధాల విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానంపై నాలుగు ప్రశ్నలు సంధించింది. వాటికి సమాధానం తెలుసుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ దిల్లీలో శనివారం భేటీ అయిన సంగతి గమనార్హం. మోదీకి కాంగ్రెస్‌ సంధించిన ప్రశ్నలివీ.. నీ మన దేశ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, ఎవరూ ఆక్రమణకు దిగలేదని గల్వాన్‌ ఘర్షణల తర్వాత మీరు చైనాకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దానివల్ల ఆ దేశంతో చర్చల్లో మన పరిస్థితి బలహీనపడలేదా? నీ లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోకి చైనా చొచ్చుకురావడాన్ని మీరెందుకు అనుమతించారు?నీ ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతుగా నిలిచినా మీరెందుకు గట్టిగా నిలదీయలేదు? నీ చైనాతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకునేందుకు ఎందుకు అనుమతించారు? .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





