
నీలిరంగు తోకతో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పక్షి పేరు బ్లూ-టెయిల్డ్‌ బీ-ఈటర్‌. కళ్లకు అడ్డంగా నల్లని పట్టీలు, గొంతు, ఉదర భాగాలు పసుపు, గోధుమ రంగులో ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి ఆకులు లేని చెట్ల కొమ్మల మీద కూర్చొని ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలిలోకి దూసుకెళ్లి తూనీగలు, కందిరీగలను పట్టుకుంటాయి. మళ్లీ తిరిగి కొమ్మపైకి చేరి వాటిని చంపి తింటాయి. ఈ పక్షులు దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. దట్టమైన, ఓ మోస్తరు చెట్లున్న అడవులు వీటి ఆవాసాలు. కుంటలు, చెరువుల, వాగులు వంటి నీరున్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో అటవీ డివిజనల్‌ అధికారి ఎం.రామ్‌మోహన్‌ తీసిన చిత్రమిది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.