
ప్రజలకు గవర్నర్, సీఎం చవితి శుభాకాంక్షలు ఈనాడు, హైదరాబాద్‌: వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆకాంక్షించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఆదివారం గవర్నర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. ‘‘గణేశ్‌ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి’’ అని సీఎం ఆదేశించారు.విఘ్నాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పండగ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేవుడి దయతో రాష్ట్రంలో వ్యవసాయం గాడిన పడాలి. పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి’’ అని ఏకదంతుణ్ని కేసీఆర్‌ ప్రార్థించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.