
దిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళం, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అనువైన ఆసుపత్రుల స్వాధీనత ద్వారా మరింత విస్తరించేందుకు మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (మణిపాల్‌ హాస్పిటల్స్‌) ప్రయత్నిస్తోంది. కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికత సాయంతో డిజిటల్‌ సేవలూ విస్తరిస్తామని 2025-26 ఆర్థిక నివేదికలో సంస్థ తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోనూ విలీనాలు, కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తోంది. సంస్థ తన నెట్‌వర్క్‌లోని క్లినికల్, డయాగ్నోస్టిక్, అడ్మినిస్ట్రేటివ్‌ కార్యకలాపాలను అనుసంధానించేందుకు ఏకీకృత హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను విస్తరిస్తోంది. కాల్‌సెంటర్‌ను ఏఐ ఆధారిత యాంత్రీకరణతో సిద్ధం చేస్తోంది. కార్డియాక్‌ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, గ్యాస్ట్రోసైన్సెస్, ఆర్థోపెడిక్స్, రీనల్‌ సైన్సెస్‌ కోసం రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టమ్స్, లీనియర్‌ యాక్సిలరేటర్లు, పెట్‌-సీటీ స్కానర్లపై పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ఎండీ దిలీప్‌ జోస్‌ తెలిపారు. 2030 నాటికి 2,426 లైసెన్స్‌డ్‌ బెడ్లను అదనంగా చేర్చాలన్నది లక్ష్యమన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





