
విశాఖపట్నం (రామ్‌నగర్‌): వినాయకచవితి ( Ganesh Chaturthi ) సందర్భంగా విశాఖపట్నం (Visakhapatnam) బీచ్‌రోడ్డులోని గోకుల్‌ పార్క్‌ సమీపంలో సుమారు కోటి రుద్రాక్షలతో రూపొందించిన గణనాథుడి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. యూత్‌ ఐకాన్‌ ఆధ్వర్యంలో సీరపు రాజు, ఆయన బృందం దీన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌తోపాటు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రుద్రాక్షలను తెప్పించి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోటి రుద్రాక్షలతో గణనాథుడిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 21 రోజుల పాటు భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.