
Vinayaka Chavithi 2026 Special: వినాయక చవితి పర్వదినం సందర్భంగా టాలీవుడ్లో కొత్త సినిమాల అప్డేట్ల సందడి నెలకొంది. నయనతార-సుందర్ సి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహాశక్తి’ టీజర్ రిలీజ్ చేయగా, శ్రీవిష్ణు-రామ్ అబ్బరాజు కొత్త సినిమా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే రుక్మిణి వసంత్ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ‘మంగళగౌరి’ ఫస్ట్ లుక్ తో పాటుగా.. ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదల చేశారు.




