
మెట్పల్లిలో ఫ్రీగా కూల్డ్రింక్స్ పంపిణీ చేయడంతో భారీగా జనం చేరుకున్నారు. దీంతో హైవేపై కూల్డ్రింక్స్ కోసం జనం ఎగబడటంతో కొద్దిసేపు రద్దీ, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. అయితే కొందరు ఆ కూల్డ్రింక్స్ బాటిళ్లపై ఉన్న తేదీలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఆ కూల్డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ముగియనుందని.. అందుకే ఫ్రీగా పంపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.




