
నరసరావుపేట సెంట్రల్‌- న్యూస్‌టుడే, ఈనాడు- అమరావతి : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు వేర్వేరు గ్రామాలకు చెందిన నలుగురు మృతి చెందారు. పెట్లూరివారిపాలేనికి చెందిన టి.నాగమ్మ (60), లక్ష్మీపురానికి చెందిన మేకల వెంకాయమ్మ(60), యక్కలవారిపాలేనికి చెందిన మజ్జిగ చిన్న కోటేశ్వరరావు (58), పాలపాడుకు చెందిన డేరంగుల వెంకటయ్య (55) మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే అరవిందబాబు వారి మృతదేహాలకు నివాళులర్పించి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు విచారం: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





