
పల్నాడు: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు (సోమవారం) పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరుస సెలవుల నేపథ్యంలో మార్కాపురం (Markapuram) జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Veligonda project)కు సందర్శకుల తాకిడి పెరిగింది. అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. వినాయక చవితి (Ganesh Chaturthi) వేళ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని మురుగన్‌ నర్సరీలో వినూత్నంగా వృక్ష గణపతిని తయారు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు బస్టాండ్ జలమయమైంది.






