
బెంగళూరు (చిత్రదుర్గం): భాజపా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర బాబు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్‌.. నరేంద్ర బాబును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షులు బీకే హరిప్రసాద్, మంత్రి రామలింగారెడ్డి, రాష్ట్ర గ్యారంటీల సమితి అధ్యక్షుడు రేవన్నా తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది మద్దతుదారులతో పాటు నరేంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
