
సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవి న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయని క్వీవ్లాండ్ క్లీనిక్ తెలిపింది. చామంతి టీలో యాంటీ ఆక్సిడెంట్లు, అపిజెనిన్ వంటి ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను రిలాక్స్‌గా ఉంచుతాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే ఆందోళన తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ప్లేవనాయిడ్స్, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే సెరోటోనిన్ పెరుగుతుంది. ఆందోళన తగ్గుతుంది. గ్రీన్ టీలో ఎల్-థియానైన్ అమైనో ఆమ్లం ఉంటుంది. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లూ బెర్రీస్ తింటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. పాలకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. పాలకూర తింటే డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.