
భారతీయ వంటకాల్లో సువాసన, రుచికోసం పోపు దినుసుగా వాడే మెంతులకు ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఉదయాన్నే పరగడుపున మెంతి నీళ్లు తాగడం, నానబెట్టిన మెంతులను నమిలి తినడం ఒక ట్రెండ్‌గా మారింది. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి కీలక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఆరోగ్యానికి అమృతంలా భావించే మెంతులు అందరికీ సరిపడవని, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు వీటిని తీసుకుంటే తీవ్రమైన అనర్థాలు ఎదురవుతాయని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ విపుల్ హెచ్చరిస్తున్నారు.





