
జోగులాంబ గద్వాల : విద్యుత్ కోతలకు ( Power Cuts ) నిరసనగా జిల్లాలోని కేటిదొడ్డి మండలం నందిన్నె సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ఆందోళన (Farmers Protest ) నిర్వహించారు. గ్రామాల్లో వేళాపాళా లేని కరెంటు కోతలపై రైతాంగం తీవ్ర నిరసన తెలిపారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, తక్షణమే నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్ రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులపాలు చేస్తుందని విమర్శించారు. నారు వేసినప్పటి నుంచి పంట ఇంటికొచ్చేదాక రైతులకు అవసరమయ్యే సౌకర్యాల కల్పనలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అసలే వర్షాలు లేక సతమతమవుతున్న రైతాంగానికి కనీసం సాగు నీరు, సక్రమంగా విద్యుత్‌ను అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
