
ఎల్‌నినో ప్రభావం (Elnino Effect).. ఈ సారి గణేశ్ విగ్రహాల అమ్మకాలపైనా పడింది. ఉమ్మడి అనంతపురం (Anatapur) జిల్లాలో రెండు నెలలకుపైగా వర్షాలు లేకపోవడంతో ఈ సారి వినాయకచవితి ఉత్సవాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఏటా 15 నుంచి 20 అడుగుల మేర గణేశ్ ప్రతిమలను వీధుల్లో ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించేవారు. ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వేసవిని తలపించే ఉష్ణోగ్రతలతో గణేశ్ ఉత్సవాల్లో జోష్ కొంత మేర తగ్గింది. ఏటా కర్ణాటక (Karnataka) నుంచి వచ్చి గణేశ్ ప్రతిమలను కొనుగోలు చేసే ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఈసారి రాకపోవడం కూడా భారీ ప్రతిమలు మిగిలిపోవడానికి కారణమని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త చదివారా: భళా.. గణపయ్య సేవలో గండుచీమ.. వీడియో






